Rahu Chandra Sahitha Subramanya Pasupatha Homam
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం
భగవద్బంధువులారా!
స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపదమాసం పూర్ణిమ ఆదివారం 07-09-2025వ తేదీ రాత్రి 09:58 ని॥ లకు ప్రారంభమై 08-09-2025 వ తేది 1:27 ని॥ ల వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. దాదాపు 3 గంటల 30 ని॥లు గ్రహణ సమయం.
తేదీ : 07-09-2025 ఆదివారం
ఈ గ్రహణం కుంభ రాశిలో శతభిష, పూర్వాభాద్ర నక్షత్రములలో ఏర్పడుతుంది. కావున కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు గ్రహణ వీక్షణ చేయరాదు. అలాగే గ్రహణం అనంతరం యధావిధిగా గ్రహణశాంతి చేసుకోవాలి.
ఈ సంపూర్ణ చంద్రగ్రణ ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉండబోతున్నదొ తెలుసుకుందాము. కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారికి అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. (అరిష్టాలు).
గ్రహణ శాంతి: గ్రహణ దోషాలు ఉన్నవారు గ్రహణ శాంతులు చేయించుకోవాలి. పై రాశులవారే కాకుండా మిగిలిన రాశులవారు కూడా గ్రహణ ప్రభావం కొంత మేర ఉంటుంది కావున వారు కూడా గ్రహణం అనంతరం మరుసటి రోజు యధావిధిగా గ్రహహణశాంతి చేసుకోవాలి.
గ్రహణశాంతి చేయించుకోలేని వారికోసం ఏక వార రుద్రాభిషేకం రాహుచంద్ర సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం
నిర్వహించబడును. తద్వారా గ్రహణ ప్రభావం తొలగి శుభ ఫలితాలను అందుకుంటారు.
గమనిక : రాత్రి 9:30 గంటలలో పుభోజనాదులు ముగించవలెను. గ్రహణ సమయంలో ఏమి(తినరాదు) భుజించరాదు. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు,చూడకూడదు.
వివరాలకు సంప్రదించండి : +91 90141 26121, +91 8466932224