దిన ఫలాలు 01-04-2024

మేషం:  ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.


కర్కాటకం: పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.


సింహం: చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు సేకరణ.


కన్య: భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తగాదాలు, కోపతాపాలకు దూరంగా వుండండి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.


తుల: విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.


వృశ్చికం: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. స్వల్ప ధన లాభం.


మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.


కుంభం: శ్రమ అధికంగా ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.


మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121