Dakshinavarti Shankh

Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావృత శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు.


పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే సకల శుభాలు చేకూరుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. శంఖం సముద్ర మథనం నుండి లభించిందని చెబుతారు. దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం జరిగినప్పుడు, ఆ సమయంలో సముద్రం నుండి 14 రత్నాలు వచ్చాయి. అందులో శంఖం ఒకటి. శంఖములలో దక్షిణావృత శంఖము ఉత్తమమైనదిగా చెప్పబడుచున్నది. ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదు


దక్షిణావృత శంఖం ఎలా ఉంటుంది సముద్రంలో కనిపించే శంఖాలు ఎక్కువగా ఎడమ రెక్కల శంఖులే. ఈ శంఖుల ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. దక్షిణ శంఖ ముఖం కుడి వైపు ఉంటుంది. ఈ శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా, ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు


దక్షిణావృత శంఖాన్ని ఇలా పూజించండి ఇంట్లో దక్షిణావృత శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని ఇంట్లో పెట్టుకునే ముందు శుభ్రమైన ఎరుపు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ శంఖాన్ని గంగాజలంతో నింపాలి. ఒక రోజు పూర్తయ్యే వరకు ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణావృత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి పెట్టాలి. దీనిని ప్రతి శుక్రవారం పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదు.


దక్షిణావృత శంఖం ప్రాముఖ్యత పురాణాల ప్రకారం ఎవరైతే తన దక్షిణావృత శంఖాన్ని కలిగి ఉంటారో.. ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.


. శాస్త్రం ప్రకారం దీపావళి రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు

. శంఖాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు.

. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించే సమయంలో దక్షిణావృత శంఖంలో గంగాజలం నింపి పూజలో ఉంచండి

. పూజానంతరం ఓం శ్రీ లక్ష్మీ సహోద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి

. లక్ష్మీపూజ తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకి లోటుండదు

. దక్షిణావృత శంఖాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ఉండవు, శత్రువులు మీకు హాని చేయలేరు

. లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుందని విశ్వశించే ఈ శంఖం ఆర్థకి సంక్షోభం నుంచి విముక్తి కల్పిస్తుంది


దక్షిణవర్తి శంఖం, కాదు దక్షిణావృత శంఖం చెప్పారు. తెలియచేసారు అలా అన్న మాట 

Products related to this article

Dakshinavrutha Shankh

Dakshinavrutha Shankh

Explore the sacred Dakshinavarta Shankh, its spiritual significance, health benefits, and how it's used in Vedic rituals and Hindu worship...

₹199.00