సంతానం కోసం రేగుపళ్ళ నోము
పూర్వకాలం నుండి హిందూ సాంప్రదాయాలలో వ్రతాలు నోములు చేయడం జరిపించడం జరిపించడం తరతరాలుగా వస్తుంది. దీనిలో ముఖ్యంగా సంతానం కోసం అనేక నోములు వ్రతాలు చేస్తుంటారు. సంతానం కోసం ప్రత్యేకమైనది రేగులనోము.
నోము కథ :
పూర్వ ఒక మహారాణి తనకు సంతానం కలగడంలేదు అని ఎన్నో రకాల నోములు, వ్రతాలు నిర్వహిస్తూ ఉండేది. అందరి దేవుళ్ళను భక్తిశ్రద్ధలతో పూజలు, నోములు, వ్రతాలు చేసింది. ఎంత కాలం అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. చిన్నపిల్లలను చూసినప్పుడు మనసు ఆవేదనకు గురయ్యేది. అలా ఆవేదనలు దేవుడి ఎదుట నిలబడి 'నేను ఎన్నో వ్రతాలు, నోములు నోచినా ఆదినారాయణుడివైన నీకు నామీద దయకలగడం లేదు' అని నిందిస్తూ ఉండేది. దీంతో ఆదినారాయణుడు ఈమె ఆవేదనను, మాటలను విని వినీ విసిగిపోయాడు. ఒకనాటి రాత్రి ఆమె కలలో కనిపించి 'ఓ మహారాణీ! నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది. నువ్వు ఎన్నో రకాల నోములను, వ్రతాలను జరిపిస్తున్నావు కానీ నువ్వు పట్టిన రేగుల గౌరీ నోము మధ్యలోనే నిలిపివేయడం వల్ల నీకు సంతానం కలగడం లేదు. అంతేకాకుండా నువ్వు నన్ను తిట్టడంతో పాపాలను మూటగట్టుకుంటున్నావు. కాబట్టి నీవు వెంటనే రేగుల గౌరీ వ్రతాన్ని నోచుకుని విధివిధానంగా పూర్తి చేయి, నీకు తప్పకుండ సంతానం కలుగుతుంది' అని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే మహారాణి మేల్కొని తాను చేసిన తప్పును తెలుసుకుని ఆ మరురోజునే మహారాజుకు జరిగిన సంగతి మొత్తం వివరించి చెప్పింది. మహారాజు దగ్గర అనుమతి పొంది ఈ రేగుల గౌరీ నోమును ఎటువంటి లోపాలు లేకుండా విదివిదానంగా శాస్త్రోక్తంగా పూర్తి చేసింది. నోము పుణ్యఫలం వల్ల రాణి వెంటనే గర్భం దాల్చి పండంటి మగపిల్లాడిని ప్రసవించింది.
వ్రత విధానం :
ఏదైనా ఒక పవిత్రమైన రోజున ఈ నోము నోచుకోవచ్చు. ఈ రోజు నోచుకున్న రోజు సద్గుణాలతో కలిగిన ఒక బ్రాహ్మణుడికి తొమ్మిది కుంచెల రేగిపండ్లు, ఒక కొత్త పంచె, దక్షిణ తాంబూలాలతో సమర్పించి ఆశీస్సులు పొందాలి. ఈ విధంగా సమర్పించిన తరువాత ఒక సంవత్సరం పాటు పైన పేర్కొన్న కథను ప్రతిరోజూ గుర్తుపెట్టుకుని అక్షతలు తలపై వేసుకుంటూ వుండాలి. ఉద్యాపన రోజున ఒక సరికొత్త వెదురు గంపలో తొమ్మిది కుంచెల రేగిపళ్ళు పోసి, వాటిలో తొమ్మిది ప్రమాణాల బంగారపు రేగిపండు వేసి, ఒక కొత్త పంచలచావు తాంబూలం, దక్షిణ వుంచి ఒక పేదవాడికి దానం ఇవ్వాలి.
Note: HTML is not translated!