Devotional
devotional
Subcategories
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా | దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీర..
గిరిజా
దేవి(బిరాజదేవి) శక్తిపీఠంఒడ్యాణం అంటే
ఓడ దేశం అని (ప్రస్తుత ఒరిస్సా రాష్టం).
ప్రస్తుత
ఒరిస్సా రాష్ట్రములోని
కటక్ నగరం సమీపంలోని వైతరణీనది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు
త్రిశక్తి స్వరూపిణిగా వెలసివుంది.
ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజీపూర్ లో వుంది. ఈ జాజీపూర్ భువనేశ్వర్ కు సుమారు 100 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రదేశములో సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా 'ఒడ్యాణే గిరిజాదేవి' అని పేర్కొనబడింది.అష్టాదశ శక్తి పీఠాల(18) వివరణ &n..
మోక్షదా ఏకాదశి వ్రతంమోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమౌతుంది. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు , అవసరాలు వుంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్ధించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్ధం మోక్షాన్ని కోరడమే అవుతుంది.పాపాలు
చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం , మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్టయితే అన్నిరకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ వుంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా 'మోక్షదా ఏ..
పూరీ - శ్రీ జగన్నాథ దేవాలయంభారతదేశంలోని నాలుగు ధామ్లలో (తీర్థయాత్రలు) ఒకటిగా పరిగణించబడే
పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం, ఒడిషా రాష్ట్రంలోని పురాతన నగరం పూరీలో ఉంది. భగవంతుడు
జగన్నాథుడికి అంకితం చేయబడింది - విశ్వానికి ప్రభువు, విష్ణువు యొక్క ఒక రూపం, ఈ పురాతన
ఆలయం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవం సందర్భంగా ఈ సంఖ్య విపరీతంగా
పెరుగుతుంది.కళింగ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన ఆలయంతో
పాటు, అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
ఈ పవిత్ర క్షేత్రంలో ప్రధాన దేవతలు జగన్నాథుడు, అతని సోదరుడు ..
లక్ష్మీ నివాసం ఎక్కడ...?ఒకసారి నారాయణుడు లక్ష్మీ దేవితో "ప్రజలలో ఎంత భక్తి పెరిగింది.
అందరూ "నారాయణ” అంటూ జపిస్తున్నారు.ఆ మాటలు విని లక్ష్మీదేవి “అది మీ కోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే
మీమీద భక్తి పెరిగింది అని అంటుంది."అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటంలేదు"
అంటాడు నారాయణుడు. “అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు” అంది. సరే అంటాడు నారాయణుడు.నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి
తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, “మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు ?” అని
అడుగుతాడు.'నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకొంటున్నాను”
అంటాడు. గ్రామాధ..
మార్గశిరం@రోజూ పండుగే!- ఈ మాస విశిష్టతేంటి?తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికినీ, అందులో
కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తిక మాసం పూర్తి చేసుకొని,
మార్గశిర మాసంలోకి అడుగు పెట్టిన సందర్భంగా, మార్గశిర మాస విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం. లక్ష్మీ నారాయణునికి ప్రీతికరం మార్గశిరంలక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ
మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర
మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ
పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని ..
సుబ్రహ్మణ్యేశ్వర
షష్టి,మార్దశిర శుద్ధ
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామినిపూజించడం తప్పనిసరి.
నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యఅరాధనమే తరుణోపాయం.స్కంధ పంచమి,
షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశద్ధలతో ఆరాధిస్తే
సకలసంపదలు, సుఖవంతమైన
జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెబుతున్నదజాతకంలో కుజ
దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేతసుబ్రహ్మణ్యస్వామి
కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.పెళ్లికాని
వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆ..
ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు ? ....శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం, రామాయణంలోనే
కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ
రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల
మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ, పోరులోకి దిగిన
రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.
తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెం..
ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా
నిర్మించుకున్నాడట...!! జంబుకేశ్వర
దేవాలయంశివుడి పంచభూతలింగ క్షేత్రాల్లో, జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర
క్షేత్రం. ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం, వృద్ధశిల్పి రూపంలో
వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి, నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు, స్థలపురాణం
ద్వారా తెలుస్తోంది. దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు. దేశంలో ప్రసిద్ధిగాంచిన
శైవ క్షేత్రాలు మాత్రమే కాదు.. మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని
తిరుచిరాపల్లిలో, ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం, అన్ని..
ఉపవాసాల ఏకాదశి నవంబర్ 26 మంగళవారం ఉత్పన్న
ఏకాదశి సందర్భంగా... కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి
అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన
ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో
ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా
పేర్కొంటారు.ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయననుంచి
ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు
ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వర..