Devotional

devotional

Subcategories

దక్షిణాయన పుణ్యకాలం : భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం ‘మకర సంక్రాతి’గా నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాoతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుంచి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆరునెలలు దక్షిణాయ..
శ్రీమాతరం భావయే  అమ్మ తొలి పేరే శ్రీమాతా. మాతా అంటే అమ్మ. అమ్మకి ఎన్ని పేర్లున్నా ‘అమ్మ’ అనే పేరే అత్యంత దివ్యమైంది. అమ్మ శ్రీమాత. శ్రీ అనేది అనేక అర్థాలతో కూడుకుంది. శ్రేయం, పూజ్యం ఈ రెండు శ్రీ శబ్దానికి అర్ధాలు. శ్రేష్ఠమైన మాత. అత్యంత ఉత్కృష్టురాలైన తల్లి. సమస్త జగత్తుచేత, దేవతల చేత, మునుల చేత కూడా పూజింపబడే తల్లి కనుక శ్రీమాత. అమ్మ అనేది కారణాన్ని తెలియజేస్తుంది. మాతా అంటే కారణము అని అర్ధం. ఈ సమస్త జగత్తుకి జీవకోటికి కూడా కారణమైన పరాశక్తి శ్రీమాత. కావ్యం శ్రీతో ప్రారంభించాలంటారు. అలాగే లలితాసహస్రనామస్తోత్రం అనే దివ్యశాస్త్రం శ్రీకారంతో ప్రారంభం అవుతోంది. అమ్మ నిజమైన పేరు శ్ర..
పూరి జగన్నాథుడుఈ క్షేత్రానికి సంబంధించిన కథను పూరీలో నీలమాధవుని (= విష్ణువు) మందిరం నిర్మించాలని ఇంద్రద్యుమ్నుడనే రాజు అనుకొన్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన సంకల్పం నెరవేరాలన్న పట్టుదలతో సముద్రపు తీరములో ప్రాయోపవేశము (= పస్తులతో ప్రాణమును విడిచిపెట్టడమనే వ్రతము) చేసాడు. అతని దీక్షకు సంతసించి నీలమాధవుడు అశ్వమేధ యాగం చేయమని సందేశము ఇచ్చాడు. ఆ యాగపు పూర్ణాహుతి వేళ సముద్రం నుంచి ఒడ్డుకు ఒక దారువు (కొయ్య దుంగ) చేరుతుందని చెప్పాడు. ఆ దారువుతో విగ్రహాన్ని చేయమని చెబుతాడు. అలా ఏర్పడిందే జగన్నాథుని కొయ్య బొమ్మ.జగన్నాథుడు వెలిసిన ప్రదేశం కాబట్టి మొదట ఇది జగన్నాథపురిగా పేరు వచ్చింది. క్రమం..
ఆషాడమాసం, ఆదివారం Ashadha Amavasya 2024: ఆషాడ అమావాస్య, భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య ...ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగష్టు 4 ఆదివారం వచ్చింది.అత్యంత పవర్ ఫుల్ అని చెబుతారు పండితులు. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత హిందూ మతగ్రంధాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ రోజు పవిత్ర స్థలాలను సందర్శించి..నదీ స్నానం ఆచరించి పిండప్రదానాలు చేస్తారు. ఈ రోజు పెద్దల పేరుతో చేసే దాన , ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు. ఇంద్రకీలాద్రిపై ఆషా..
రుద్రం విశిష్ఠత  శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవర..
వాగ్దేవతలు ::తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం ::"అ" నుండి "అః" వరకు "అఆఇఈఉఊఋౡ ఎఏఐఒఓఔఅంఅః" ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అనగా "వశపరచుకొనే శక్తి కలది" అని అర్ధం."క" నుండి "భ" వరకు "కఖగఘఙచఛజఝఞటఠడఢణతథదధనపఫబభ" ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం" అని అంటారు.ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అనగా "కోర్కెలను మేలుకొలిపేది" అని అర్ధం.*"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అనగా  "సంతోషాన్ని వ్యక్తం చేసేది" అని అర్థం."ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్ష..
July 2024 Programme Schedule : జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు తిరుపతి, 2024 జూన్ 30: టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.– జూలై 4 నుండి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.– జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు.– జూలై 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం.• జూలై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకే..
శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి స్వామివారికరుణాకటాక్ష చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాముఓం గం గణపతయే నమఃఓం శ్రీ గౌరీ పుత్రాయ నమఃఓం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమఃఓం శ్రీ హేరంబ లక్ష్మీ గణాధిపతయే నమఃఓం శ్రీ విఘ్నరాజాయ నమఃఓం శ్రీ విజయ గణపతి స్వామియే నమఃశ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిఃఓం శ్రీ సుముఖాయ నమఃఓం శ్రీ ఏకదంతాయ నమఃఓం శ్రీ కపిలాయ నమఃఓం శ్రీ గజకర్ణకాయ నమఃఓం శ్రీ లంబోదరాయ నమఃఓం శ్రీ వికటాయ నమఃఓం శ్రీ విఘ్నరాజాయ నమఃఓం శ్రీ గణాధిపాయ నమఃఓం శ్రీ ధూమ్రకేతవే నమఃఓం శ్రీ గణాధ్యక్షాయ నమఃఓం శ్రీ ఫాలచంద్రాయ నమఃఓం శ్రీ గజాననాయ నమఃఓం శ్రీ వక్రతుండాయ నమఃఓం శ్రీ శూర్పకర్ణాయ నమఃఓం శ్రీ హేరంబాయ ..
*ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మెదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాలను చూసి దారినపోయె ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయటపెట్టి అయ్యా ... అని అరిస్తే ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చినచెంబుని బయట ఇచ్చే వాడు.రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు. అయినా అమ్మ దర్శనం కాలా విసుగెత్తిపోయాడు. ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోస..
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలుతిరుపతి, 2024 జూన్ 25: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్ర..
Showing 91 to 100 of 1007 (101 Pages)