Padarasa Shivalingam Pooja Phalam
లక్ష్మీదేవి ఉపాసనకు తంత్ర శాస్త్రంలో సరళమైన విదానముంది ...
ధన శివేన బినా దేవీ న దేవ్యా చ బినా శివః!
నానయోరంతర్ కిమ్ చిచంద్ర యోరివ్!!
అంటే శివుడు లేకుండా దేవి (అన్నపూర్ణ లక్ష్మీ) లేదు. దేవి (శక్తి)లేకుండా శివుడు లేదు. చంద్రుడి నుండి వెన్నెలను వేరు చేయగలమా? వెన్నెల నుండి చంద్రుడిని వేరు చేయగలమా? వీటిలో ఏదీ వీలు పడదు. తంత్ర శాస్త్రానికి ఆద్యుడు, మూల కారకుడు శివుడిని ఆధారం చేసుకుని శ్రీవిద్య, శ్రీయంత్ర ప్రత్యేకత, విశిష్టత తంత్ర శాస్త్రంలో ఉంది. సంస్కృతంలో పారద్ అనే పదం, తెలుగులో పాదరసంగా మారింది. పారద లింగం, పాదరసలింగం ఒక్కటే. పారదం శబ్దంలోని అర్థం విడదీస్తే …
ప = విష్ణువు
అ = కాళికా
ర = శివుడు
ద = బ్రహ్మ ప్రతీకం
పారదలింగ పూజ ద్వారా దానం, ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయి. వాగ్భట్టుని చెప్పినట్లుగా పాదరస శివలింగ పూజ చేసినవారు ముల్లోకాలలోని శివలింగాలకు పూజ చేసినట్లే అని తెలిపారు. తాంత్రికుల ప్రకారం పాదరస శివలింగ దర్శనమే మహా పుణ్యం అని అంటున్నారు. పాదరస శివలింగ దర్శన ఫలం వంద (శత) అశ్వమేధయాగాలు చేసిన ఫలం, కొన్ని కోట్ల గోదాన ఫలం, కొన్ని వేల మణుగుల బంగారాన్ని దానం చేసిన ఫలం దక్కుతుందని తంత్రశాస్త్రంలో వివరించబడింది. పాదరస శివలింగ పూజకు గురుపౌర్ణమి విశిష్ట ముహూర్తం పాదరస శ్రీయంత్రం గానీ, పాదరస శివలింగం గానీ, పాదరస కుబేర యంత్ర ప్రతిష్ఠాపన వల్ల సుఖశాంతులు, సమృద్ధి సంపద, వాస్తుదోష నివారణ జరుగుతుందని మన పూర్వికులు తెలిపారు.










Note: HTML is not translated!