Article Search

Articles meeting the search criteria

S.No  Karthika Puranam   Other Importance Days Day 1 కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము కార్తీక మాస విశిష్టతలు Day 2 కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము క్షీరాబ్ధి ద్వాదశి Day 3 కార్తీక పురాణము -  మూడవరోజు పారాయణము  కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత? Day 4 కార్తీక పురాణము -  నాలుగవ రోజు పారాయణము కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం? Day 5 కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము కార్తీక సోమవారం విశిష్టత? Day ..

కార్తీక పురాణము - ఎనిమిదవ రోజు పారాయణం                    

 

వశిష్ట ఉవాచ ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో  సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. 

 

కార్తీక పురాణము - ఆరవరోజు పారాయణము

 

ఓ మహారాజాకార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుందిగరికతోనూకుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారుచిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారుకార్తీక స్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళూపురాణ పాఠకులూశ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారుఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ నశింపచేసేదీఆయురారోగ్యదాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను విను.

కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము

 

యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి' 

 

 కార్తీక పురాణము -  నాలుగవ రోజు పారాయణము

ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు.

కార్తీక పురాణము - మూడవరోజు పారాయణము 

'ఓ శివధనుస్సంపన్నాజనకరాజాశ్రద్ధగా వినుమనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుందికార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరయితే భగవద్గీతా పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయిఅన్డునీ పదీ-పదకొండూ అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు

కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము 

బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 'రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయ వంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు

Showing 1 to 7 of 7 (1 Pages)