Gowri Vratham

 మాఘమాస గౌరీవ్రత మహత్యం

 
మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించడమే మన సంప్రదాయంలో ఋషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలు ఏమిటో, వాటి వల్ల జన్మజన్మలకు కలిగే నష్టం ఏమిటో వివరంగా తెలపబడింది. రెండవ అధ్యాయం చివరలో, మూడవ అధ్యాయంలో మాఘస్నాన ఫలితం వల్ల ఆ పాపాలను పోగొట్టుకోవచ్చు అన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్థిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా వుంది. పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడికి యిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తరువాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజులలోనే ఆ కాశ్మీర వాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఒక రోజున దృఢవ్రతుడు అనే ఒక యోగి సుదేవుడి ఆశ్రమానికి వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అథితి పూజాసత్కారాలు చేసి తన కుమార్తెకు వచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గతజన్మలో భర్తను హింసించటం, చేయకూడని పనులు చేయడం వంటి పాపాలు చేసిందని, అయితే ఒక రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీవ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడు అనే శిష్యుడి సాంగత్యం పొందింది అని తెలిపాడు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. సుదేవుడు వెంటనే ఆ గురువుతో తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయినీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.        

Products related to this article

Pala Gavvalu (9 Pieces)

Pala Gavvalu (9 Pieces)

Pala Gavvalu ..

₹225.00

Copper Bottle

Copper Bottle

Copper BottleThe length of the copper Bottle is : 27 InchsHeight : 24 Inchs Width: 7 Inchs One of the most common problems encountered these days is indigestion. Acidity, gas or simply the i..

₹550.00

Ammavari Face (Kundan Work)

Ammavari Face (Kundan Work)

Ammavari Face (Kundan Work)DescriptionNo of item : 1 Lakshmi MaskHeight : 18.5 Cms Width : 9.2 CmsBeautiful stone studded and hand painted Goddess Lakshmi Devi.Beautifully decorate..

₹651.00

0 Comments To "Gowri Vratham "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!